Fire Accident at Secunderabad : సికింద్రాబాద్‌లో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు - సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం
Fire Accident at Secunderabad Palika Bazaar : సికింద్రాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు స్థానికుల్ని భయబ్రాంతుల్ని చేస్తున్నాయి. రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఇవాళ ఉదయాన్నే మరోసారి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పాలికబజార్‌లోని ధమాకా అనే వస్త్రదుకాణంలో చెలరేగిన మంటలు.. పక్క షాపులకూ అలుముకున్నాయి. వస్త్ర దుకాణంలోంచి ఆయుర్వేద దుకాణానికి వ్యాపించిన మంటలు.. ఆపైన ఉన్న లాడ్జ్‌లోకి సైతం వ్యాపించాయి. ఈ ఘటనతో వస్త్ర దుకాణం పరిసర ప్రాంతాలన్ని దట్టమైన పొగతో నిండిపోయాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. విద్యుదాఘాతం ద్వారానే ప్రమాదం జరిగిందన్న కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా సికింద్రాబాద్ బోనాల కారణంగా ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంది. ఎవ్వరికి ఏ హానీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.