తెలంగాణ

telangana

Fire Accident in MPDO Office Room

ETV Bharat / videos

భద్రాచలంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం - కాలి బూడిదైన కీలక దస్త్రాలు - ఎంపీడీఓ ప్రత్యేక అధికారి రికార్డు రూంలో అగ్ని

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 5:17 PM IST

Fire Accident in Badrachalam MPDO Office Room : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పాత ఎంపీడీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం (fire Accident) జరిగింది. ఎంపీడీవో కార్యాలయంలోని మండల ప్రత్యేకాధికారి ఆఫీసులోని రికార్డు గది కాలిపోయింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో కార్యాలయం నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి కార్యాలయంలోని రికార్డు గది పూర్తిగా దగ్ధమైంది.  

Fire Accident in Record Room : అందులోని రికార్డులన్నీ కాలి బూడిదయ్యాయి. పాత ఎంపీడీవో కార్యాలయం కావడం వల్ల ఉపాధి హామీకి సంబంధించిన రికార్డులు, బీసీ బంధు రికార్డులు, దళిత బంధు రికార్డులు, పింఛన్​ రికార్డులు, రేషన్​ కార్డులకు సంబంధించిన ఇతరత్రా అన్ని రికార్డులు ఈ గదిలో ఉన్నాయి. ఈ అగ్నిప్రమాదం షార్ట్​ సర్క్యూట్​ వల్ల జరిగిందా లేదా ఎవరైనా కావాలనే కార్యాలయానికి నిప్పంటించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details