కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం - రూ.10 కోట్ల ఆస్తి నష్టం - Kamareddy Fire Accident news
Published : Dec 14, 2023, 9:32 AM IST
Fire Accident At Shopping Mall In Kamareddy : కామారెడ్డి జిల్లాలో ఓ షాపింగ్‌మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి 11:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్ని కీలలు భారీగా ఎగసిపడడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అనంతరం ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Fire Accident In Kamareddy : బట్టల దుకాణంలో వస్త్రాలు, సామగ్రి కాలి బూడిదయ్యాయని అధికారులు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.8 నుంచి 10 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.