తెలంగాణ

telangana

Minister Harishrao fires on BJP

ETV Bharat / videos

నోట్ల రద్దు తర్వాత పెద్దనోట్ల చలామణి పెరిగింది: మంత్రి హరీశ్​రావు - బీజేపీపై మంత్రి హరీశ్​రావు ఫైర్

By

Published : Mar 14, 2023, 5:38 PM IST

Minister Harishrao Fires on BJP: కేంద్ర ప్రభుత్వం చేపట‌్టిన పెద్ద నోట్ల రద్దు కార్యక్రమంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. పార్లమెంట్‌ వేదికగా ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒప్పుకున్నారని వెల్లడించారు. నోట్ల రద్దు తర్వాత పెద్దనోట్ల చలామణి పెరిగిందన్న మంత్రి.. ఆ క్రమంలో 40 వేల కోట్ల నల్లధనం దొరికిందని సీబీడీటీ చెప్పిందని తెలిపారు. బ్యాంక్ అకౌంట్లలో రూ.1500 కోట్లు వేస్తామన్నారుగా.. మరి ఎన్ని అకౌంట్లలో వేశారని మంత్రి ధ్వజ మెత్తారు. 

      నోట్ల రద్దుతో పెట్టుకున్న లక్ష్యాల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. నోట్ల ర్దదు చేసినా 99.3 శాతం సొమ్ము బ్యాంక్‌లలోకి వచ్చింది. నోట్లు రద్దు చేసి ఏం లాభం..?  ఇవాళ వేల మంది ప్రజలను పొట్టన పెట్టుకున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. పైకి మాత్రమే బీజేపీ వారు గొప్ప గొప్పగా మాటలు మాట్లాడుతారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగలిస్తామన్నారు.. అవన్ని ఎక్కడికి వెళ్లాయి. అధికారంలోకి వస్తే.. రూ.400 ఉన్న సిలిండర్​ను రూ.200 చేస్తామని,  రూ.1200 చేశారు. పేదలకు ధరలు తగ్గిస్తామన్నారు.. కానీ, ముడింతలు పెంచిన ఘనత ఈ బీజేపీదే- హరీశ్ రావు, ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details