Father Kills His Son with Cut Throat in Kamalapuram: వైఎస్సార్ జిల్లాలో దారుణం.. కొడుకును అతికిరాతకంగా చంపిన తండ్రి - today crime news
Published : Aug 30, 2023, 11:31 AM IST
Father Kills His Son with Cut Throat in Kamalapuram:ఏపీలోనివైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కమలాపురం మండలం అగస్తలింగాయపల్లెలో కుమారుడిని ఓ తండ్రి హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు సోమేశ్వర్ రెడ్డిని(10).. తండ్రి శివశంకర్ రెడ్డి కత్తితో అతికిరాతకంగా (Father Cut His Son Throat) గొంతు కోశాడు. బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా బాలుడు ఇంటి దగ్గరే మృతి చెందారు. శివశంకర్ రెడ్డి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి హుటాహుటీన చేరుకున్నారు. అనంతరరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలను విచారణ చేపట్టారు. శివశంకర్‌రెడ్డి పిల్లలను బాగా చూసుకునేవాడని ఆయన భార్య సుజాత తెలిపింది. ఇంత ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో కుమారుడైన సోమేశ్వర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి.
"మాతో గొడవ పడడు. మమ్మల్ని చాలా మంచిగా చూసుకునేవాడు. పిల్లాడి గొంతు ఎందుకు కోశాడో నాకు అర్థం కావడం లేదు. నా గొంతు కోసినా బాగుండేది."-సుజాత, సోమేశ్వర్‌రెడ్డి తల్లి