Pratidwani : అడవిబిడ్డలు... వసతుల సవాళ్లు - అడవిబిడ్డలు వసతుల సవాళ్లు
Pratidwani : సుదూరాల్లో.. సౌకర్యాలకు దూరంగా.. అడవితల్లినే నమ్ముకొని.. పొట్టనిండితే చాలనుకొని జీవించే గిరిజనులు... వర్షాకాలంలో అత్యవసరాలైన వైద్య సేవలు సహా ఏ పనికీ ఎటూ కదల్లేక అవస్థలు పడాల్సిన దుస్థితి కొనసాగుతూనే ఉంది. గిరిజన ప్రాంతాల్లోని వేల తండాలు, గూడేలు, ప్రధాన గ్రామాలకు ఏళ్లు గడుస్తున్నా రహదారులు నిర్మించక.. చినుకు పడితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి రాకపోకలు నిలిచి పోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వాగుల ప్రవాహాలకు వందలాది గ్రామాలు అవస్థలు పడుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఎలాంటి సహాయం అందక దేవుని పైనే భారం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇంకా కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఏటా వేల కోట్లు కేటాయిస్తున్నా అవి వారి జీవితాల్లో వెలుగులను పంచలేకపోతున్నాయి. ఎన్నికల సమయంలో నేతలు చేసి హామీలు నీటిమీట రాతలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకీ దుస్థితి? ఎంత కాలం ఈ పరిస్థితి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.