తెలంగాణ

telangana

Pratidwani

ETV Bharat / videos

Pratidwani : ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కష్టాలు తీరినట్లేనా..? - ప్రతిధ్వని

By

Published : Jul 31, 2023, 9:57 PM IST

Pratidwani : ఆర్థిక ఆసరా కోసం ప్రభుత్వం వైపు.... గంపెడాశతో చూస్తున్న ఆర్టీసీకి శుభవార్త. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి ఈ నిర్ణయం నిజంగా ఓ వరం లాటిందే. బ్యాంకు రుణాల కంటే కూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలే అధికంగా పేరుకు పోయిన పరిస్థితుల్లో... ఆ మేరకు సహాయం తప్పనిసరి. తాజా నిర్ణయంతో ఆర్టీసీకి ప్రభుత్వ మద్దతు పూర్తిగా లభించినట్లే. ఇక నుంచి నిధుల సమస్య అంతగా ఉండకపోవచ్చు. అసలు.. లాభనష్టాల పరంగా ఇప్పుడు RTC ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి? హామీల సాధన కోసం ఇటీవల మళ్లీ కార్మిక సంఘాలు ఎందుకు ఐక్య ఉద్యమాల ఆలోచనలు చేయాల్సి  వస్తోంది? ఈ పరిస్థితికి... డీఏ, వేతన సవరణ, CCS బకాయిలు, పనిభారం, నియామాకాలు... ఇలా అనేక అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య లన్నింటికి పరిష్కారం లభించినట్లే అనుకోవచ్చా... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details