Pratidwani: గిరిజన రిజర్వేషన్లు... పెంపు కసరత్తులు - ఈటీవీ ప్రతిధ్వని ప్రత్యేక చర్చ
పది శాతం కోటా... వారంలో పెంపు. తెలంగాణ ఆదివాసీ, బంజారాల ఆత్మీయసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం చేసిన ప్రకటన ఇది. అందుకు సంబంధించిన జీవో విడుదలకు శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది... తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు... రాష్ట్రంలో రిజర్వేషన్లను 50 నుంచి 62%నికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉంది. అలాంటి తరుణంలో గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం, వారంలో జీవో అన్న ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఈ పెంపు ప్రతిపాదనలకు నేపథ్యం.... అధిగమించాల్సిన సవాళ్లు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST