Pratidwani: ధరణి చిక్కుముళ్లు.. ఎన్నాళ్లు?
రెవిన్యూ శాఖ తీసుకుని వచ్చిన ధరణి పోర్టల్‌తో వచ్చిన సౌకర్యాల మాట ఏమో గానీ.. భూ యాజమానుల చిక్కులు మాత్రం తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నాయి. మీటింగుల మీద మీటింగ్‌లు జరుగుతున్నాయి. తిప్పలు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. సర్వే నంబర్లు తప్పుగా నమోదు అవడం.., ఒకరి భూమి మరొకరి సర్వే నంబర్లలో చేరడం.., విస్తీర్ణాలలో హెచ్చుతగ్గులు, పాసు పుస్తకాల్లో తప్పులు..ఇలా అనేక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు పోర్టల్లో లేకపోవడంతో బాధితులు ఆందోళన బాటపడుతున్నారు. కొందరు ఇంకాస్త ముందుకెళ్లి నిరసన తెలిపే క్రమంలో అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యలకు తెగబడుతున్నారు. ఇంకెంతకాలం ఈ దుస్థితి. ధరణి చిక్కుముళ్లు వీడేదెప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST