జాతీయ సగటు కంటే ఎక్కువగా రాష్ట్రంలో సిజేరియన్లు.. ఈ సమస్యకు మూలం ఎక్కడ?
అనవసర సిజేరియన్లు చేస్తే చర్యలు తప్పవు..! కలెక్టర్లతో సమీక్ష సమావేశం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి చేసిన హెచ్చరిక ఇది. సిజేరియన్లు తగ్గించడంపై దృష్టి పెట్టాలని, అనవసరంగా వాటిని నిర్వహించే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఈ సమస్యపై నీతి ఆయోగ్, యూనిసెఫ్, జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి . ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాలకు దూరంగా, జాతీయ సగటు కంటే ఎక్కువగా తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయి? సమస్యకు మూలం ఎక్కడ? చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలు ఏమిటి? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST