బలగం సినిమా చూసినంతసేపు తాతలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి: ఎర్రబెల్లి - తొర్రూరు మండలం తాజా వార్తలు
Errabelli Dayakar Rao Watched Balagam Movie: మహబూబాద్ జిల్లా తొర్రూరులో శ్రీ వెంకటేశ్వర కళామందిర్ థియేటర్‌లో బలగం సినిమాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తిలకించారు. చిత్ర నటీనటులతో ఆయన సినిమాను వీక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న సన్నివేశాలను ఉట్టిపడేలా తీస్తున్న సినిమాలను.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. చిన్న చిత్రాలకు రాష్ట్రంలో ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని ఆయన వివరించారు.
బలగం సినిమా చూసినంతసేపు తాతలనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరు అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ మూవీ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే మరో ప్రతిష్ఠాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. ఉక్రెయిన్‌లో జరిగిన ఓనికో ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ సినిమాకు బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డు వరించింది.