Errabelli Comments on CM KCR : 'ప్రజా సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే' - తెలంగాణ పథకాలపై ఎర్రబెల్లి దయాకర్‌రావు
Errabelli Comments on Telangana Development : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో భూముల విలువలు పెరిగాయని.. ఇప్పుడు ఎకరం పొలం ఉన్నా వారి ఆస్తి విలువ పెరిగిందన్నారు. రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు వంటివి ఏ రాష్ట్రంలో అమలు అవ్వడం లేదన్నారు. మాయ మాటలు కాదని.. కళ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.