Man Stuck in Erra Vagu Live Video : ఎర్రవాగులో ఇరుక్కున్న వ్యక్తి.. చివరికి..! - ఎర్ర వాగులో ఇరుక్కున్న వ్యక్తి
Man Stuck in Erra Vagu in Mancherial: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, కాలువలు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్నాయి. దీని వల్ల స్థానికులు సమస్యల్లో పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో నెన్నెలలో ఉన్న ఎర్ర వాగు వద్ద ఓ వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. జంగల్ పేట నుంచి నెన్నెల వెళ్లడానికి ఎర్ర వాగు దాటుతుండగా సమ్మయ్య అనే వ్యక్తి వాగులో పడిపోయాడు. కల్వర్టు పైపులో కాలు పడి అందులోనే ఇరుక్కుపోయాడు. అప్రమత్తమైన స్థానికులు అతి కష్టం మీద సమ్మయ్యను బయటకు తీశారు. సమయ్య బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్షానికి ఎర్ర వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో జంగల్ పేట, నెన్నెల మండల కేంద్రానికి రాకపోకలు నిలిచి పోయాయి. వాగులు, కాలువలు, చెరువుల వైపు వెళ్లేనప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ప్రవాహం ఎక్కువగా ఉన్నచోట నుంచి రవాణా మార్గం తగ్గించుకోవాలని సంబంధిత అధికారులు చెప్పారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దని వాతావరణ నిపుణులు సూచనలు ఇచ్చారు.