Electric Scooter Fire in Jagtial : స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు.. కొద్దిలో మిస్సయ్యాడు.. - తెలంగాణ తాజా వార్తలు
Published : Oct 11, 2023, 3:06 PM IST
Electric Scooter Fire in Jagtial : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల శివారులోని రైతు వేదిక వద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమైంది. ఒక వ్యక్తి విద్యుత్ వాహనంపై వెళ్తుండగా.. అకస్మాత్తుగా వాహనం నుంచి పొగలు వ్యాపించాయి. దీంతో ఏమీ అర్థం కాని వాహనదారుడు అయోమయంలో పడ్డాడు. పొగలు ఎక్కువవడంతో అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని అక్కడే నిలిపి పక్కకు వెళ్లాడు. కొద్దిసేపట్లోనే భారీగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.
E Scooret Fire News 2023 :నడిరోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనను చూసిన వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. బుగ్గారం శివారు ప్రాంతమైన ఆ దారిలో ఎక్కువ జన సందోహం లేకపోవడం వల్ల ఎవరికీ ఏ హానీ జరగలేదు. బండి నడిపిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెట్రోల్ ధరలు ఎక్కువవుతున్న తరుణంలో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో తమకు డబ్బులు ఆదా అవుతాయని వాహనదారులు అనుకుంటే.. వారికి కొత్త కష్టాలు వచ్చినట్లైంది.