Election Campaign Vehicles Being Prepared : ఊపందుకున్న ఎన్నికల ప్రచార పర్వం.. సిద్ధమవుతున్న రథాలు - Hyderabad latest news
Published : Oct 16, 2023, 8:20 PM IST
Election Campaign Vehicles Being Prepared in Hyderabad :ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి వారం రోజులు కావడంతో పార్టీలు ఇక ప్రచారంపై దృష్టి సారించాయి. ప్రచారానికి కావాల్సిన సామగ్రిని, వాహనాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ప్రచార వాహనాలు (Campaign Vehicles) తయారవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రాజకీయ పార్టీల నేతలు వచ్చి ప్రచారానికి అనువైన రీతిలో వీటిని తయారు చేయించుకుంటున్నారు.
Telangana Assembly Elections 2023 :ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా తొలి జాబితా ప్రకటించడంతో.. ప్రచార రథాల తయారీలో మరింత వేగం పుంజుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను రీమోడలింగ్ చేసే పనులు జరుగుతున్నాయి. రోజంతా అనుచరులతో కలిసి తిరిగేందుకు, ఓటర్లకు స్పష్టంగా కనిపించేలా ప్రచార రథాలను తమ అభిరుచికి తగినట్లు సిద్ధం చేయించుకుంటున్నారు. వాడవాడలా ప్రచారం చేసేటప్పుడు పోటీ చేయబోయే ప్రధాన అభ్యర్థితో పాటు పక్కన మరో నలుగురు నిలబడేలా వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రచార వాహనాల రీమోడలింగ్ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.