తెలంగాణ

telangana

పాత బస్తీలో కుక్కల స్వైర విహారం.. 5ఏళ్ల బాలుడిపై కుక్క దాడి

ETV Bharat / videos

Dog Attack on Boy in Hyderabad : మరో బాలుడిపై వీధి కుక్క దాడి - hyderabad dog attack

By

Published : May 30, 2023, 7:53 PM IST

Dog Attack on Boy in Hyderabad : హైదరాబాద్​లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. కుక్కల దాడులతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. తాజాగా హైదరాబాద్​లోని పాతబస్తీ సంతోశ్​ ​నగర్ కాలనీలో కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.

సంతోశ్​ ​నగర్ కాలనీలో ఇంటి ముందు నిలబడి ఉన్న ఐదేళ్ల బాలుడు అబ్దుల్ రఫీపై వీధి కుక్క విచక్షణా రహితంగా దాడికి పాల్పడింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమి వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బాలుడికి గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుడిని నారాయణగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వీధి కుక్కల దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details