పోలాండ్‌లో ఘనంగా దీపావళి వెలుగులు - మంచులో బాణాసంచా సంబరాలు - POTA TSAP ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
Published : Nov 21, 2023, 4:16 PM IST
Diwali Celebrations in Poland : పోలాండ్ దేశ రాజధాని వార్సాలో తొలిసారిగా పోలాండ్ తెలుగు అసోసియేషన్(POTA), తమిళ్ సంఘం అసోసియేషన్ ఆఫ్ పోలాండ్(TSAP) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు ఎంబసీ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలాండ్లోని భారత రాయబారి నగ్మా మొహ్మద్ మాలిక్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన భారత రాయబారులు, పోలాండ్(Poland) కౌన్సిల్ జనరల్స్ పాల్గొన్నారు.
Diwali Celebration under POTA TSAP in Poland : ఈ గ్రాండ్ ఫెస్టివల్‌లో తెలుగు, తమిళం, పోలిష్, యూరోపియన్ పౌరులతో సహా పెద్ద సంఖ్యలో భారతీయ ప్రజలు పాల్గొన్నారు. ఆకట్టుకునే ప్రదర్శనలు, మ్యాజిక్ షో, చిన్నారులకు ఫేస్ పెయింటింగ్, పెద్దలకు సరదా ఆట, పాటలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భాష, మతం, కులాలకు అతీతంగా పోలాండ్‌లో నివసిస్తున్న భారతీయులందరినీ ఒకే వేడుకలో చేర్చడంలో పోలండ్ తెలుగు అసోసియేషన్ (POTA) విజయం సాధించిందని పోటా అధ్యక్షుడు చంద్ర భాను, ఫౌండేర్ హరి చందు తెలిపారు. ప్రదర్శనల్లో పాల్గొన్న వారికి మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. పండుగ ముగింపులో మంచు మధ్య, బాణాసంచా పేల్చి.. దీపావళి(Diwali)ని ఎంతో సంబరంగా చేసుకున్నారు.