తెలంగాణ

telangana

Massive fire in Guwahati

ETV Bharat / videos

ఘోర అగ్నిప్రమాదం.. 100 ఇళ్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం - అసోంలో అగ్నిప్రమాదం

By

Published : Feb 24, 2023, 10:42 AM IST

Updated : Feb 24, 2023, 7:38 PM IST

అసోంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గువాహటిలో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు వంద ఇళ్లు దగ్ధం అయ్యాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయిని పోలీసులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయని వెల్లడించారు. ఓ అద్దె ఇంట్లో సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయి.  

అనంతరం మంటలు చుట్టుపక్కలకు వ్యాపించి ఆ ప్రాంతమంతా దగ్ధం అయ్యిందని పోలీసులు వెల్లడించారు.  ఈ ఘటనలో దాదాపు 15 సిలిండర్లు పేలాయిని, రెండు కార్లు పూర్తిగా కాలిపోయాయని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 15 అగ్నిమాపక వాహనాలతో వచ్చి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలానికి వెళ్లే రహదారి ఇరుకైనందున అగ్నిమాపక సిబ్బందికి రావడానికి ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు వంద మందిని రక్షించామని తూర్పు డీసీపీ సూర్జిత్‌ సింగ్‌తెలిపారు.

Last Updated : Feb 24, 2023, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details