తెలంగాణ

telangana

DMart

ETV Bharat / videos

DMart Fraud : డీమార్టులో ఈ మోసాన్ని ఎప్పుడైనా గమనించారా.. మీరే చూడండి - కరీంనగర్​ డీ మార్ట్​లో మోసం

By

Published : Jun 28, 2023, 9:21 PM IST

Dmart Fraud In Karimnagar : డీమార్టులో భారీ డిస్కౌంట్​లు ఉంటున్నాయని.. మీరు వస్తువులు కొంటున్నారా.. కొన్న తర్వాత బిల్లు చూసుకోవడం లేదా.. అయితే మీరు మోసపోతున్నట్లే. ఎందుకంటే డీమార్టులో వస్తువులు కొన్న తర్వాత.. బిల్లును సరిగ్గా చూసుకోకపోతే.. ఆ వ్యాపార సంస్థకు లాభాలను ఇచ్చి.. మీ జేబులకు చిల్లులు పెట్టుకున్న వారు అవుతారు. ఒక నిమిషం ఆగి మీ బిల్లును ఓసారి చెక్ చేసుకొండి. ఎందుకంటే కరీంనగర్​ డీమార్టు స్టోర్​లో ఇలానే బిల్లుల్లో మోసం జరుగుతోందని.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. 

అది చూసిన ఆ జిల్లా కలెక్టర్​.. తూనికలు కొలతలు అధికారులకు తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది అక్కడ జరుగుతున్న మోసాన్ని బట్టబయలు చేశారు. ఒక వస్తువు కొనుగోలు చేస్తే.. దానికి రెండు, మూడుసార్లు స్కాన్​ చేయడం వల్ల.. ఒక వస్తువుపై రెండు, మూడు సార్లు బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. సాధారణంగా వినియోగదారులు ఇంటికి వెళ్లిన తర్వాత మరోసారి చెక్‌ చేసుకొనే అవకాశం చాలా తక్కువ ఉంటుందని అందువల్ల మోసపోతున్నారని తూనికలు కొలతల అసిస్టెంట్ కమిషనర్‌ విజయసారథి తెలిపారు. వినియోగదారులు విధిగా తమ వస్తువులు మరోసారి చెక్‌ చేసుకోవాలని సూచించడమే కాకుండా డీమార్ట్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు తూనికలు కొలతల శాఖ అధికారి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details