Daughter Helping Father : నాన్న కష్టాన్ని చూడలేక రైతుగా మారిన కుమార్తె - తెలంగాణ వార్తలు
Daughter Helping Father In Farming : అమ్మాయిలంటే అప్పంటి కాలంలో ఇంటి పనులు చేయడం చదువుకోవడం. తరం మారేకొద్ది వారు కూడా పొలం పనులకు వెళ్లడం లాంటివి చేశారు. ఇప్పటి కాలంలో ఉన్నత చదువులు చదివి... మంచి కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం. కానీ ఈ యువతి అందరికి భిన్నంగా చేస్తూ అందరిచేత భళా అనిపించుకుంటోంది. చండూరు మండలం పరిధిలోని శిరిదేపల్లి గ్రామానికి చెందిన గంట వెంకన్నకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె మనీషా ఇటీవల కనగల్లులోని కేజీబీవీలో ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ చదివేందుకు నల్గొండ మహిళా కళాశాలలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకుంది. ఇంటి దగ్గరే ఉన్న మనీషా వాళ్ల తల్లిదండ్రులు కూలీలు దొరక్క పడుతున్న కష్టాన్ని చూసి పత్తిలో చేను గుంటుక తోలడంలో సహాయం చేస్తుంటే ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కింది. మనిషా మాట్లాడుతు పత్తి చేనులో నాన్న చాలా కష్టపడుతున్నారు గత వారం రోజులుగా నాన్నతో పాటు గుంటుక తోలుతున్నానని తెలిపింది.