Dastagiri petetion వైఎస్ వివేకా కేసులో కీలక పరిణామం.. న్యాయ సహాయం అందించాలంటూ సుప్రీంకు దస్తగిరి
YS Vivekananda Reddy murder case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ... ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. వివేక హత్య గురించి మొదట ఫిర్యాదు చేసింది తానే కనుక.. తనను బాధితుడిగా చూడాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఐతే, ఎంవీ కృష్ణారెడ్డి అభ్యర్థనతో వివేకా కుమార్తె సునీత వ్యతిరేకించారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థ సీబీఐకి, అప్రూవర్‌గా మారిన దస్తగిరిరి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు నోటీసులపై స్పందించిన దస్తగిరి.. వివేకా హత్య కేసులో తనకు న్యాయ సహాయం అందించాలని సుప్రీంకోర్టును కోరాడు. సుప్రీంకోర్టులో తనకు న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేనందున న్యాయ సహాయం కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. తన తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని సుప్రీంకోర్టు లీగల్ సేర్వేసెస్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. మరోవైపు దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వివేకా హత్య కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం, ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. నిందితులకు ఇలాంటివి కోరే హక్కు లేదని స్పష్టం చేసింది