తెలంగాణ

telangana

Crocodile catching videos

ETV Bharat / videos

Crocodile in Farmland : అమ్మ బాబోయ్‌ మొసలి.. పొలంలో చూసి అవాక్కైన రైతులు

By

Published : Jul 18, 2023, 12:04 PM IST

Crocodile catching In Ammappalli village  Vanaparthi : మొసళ్లను మనం సహజంగా సరస్సులు, నదుల్లో మాత్రమే చూస్తాం. ఇంకా ఏ క్రొకోడైల్‌ పార్క్‌లో చూస్తాం. అలాంటింది ఓ ముసలి పంట పొలాల్లో సడన్‌గా కనిపిస్తే ఏం చేస్తాం. భయపడి పరుగులు తీస్తాం కదా..! ఇలాంటి అనుభవాలే వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామ రైతులకు ఎదురైంది. పనుల నిమిత్తం పంటపొలాల్లోకి వెళ్లిన కొందరు రైతులకు భారీ మొసలి కనిపించడంతో భయందోళనకు గురయ్యారు. దీంతో గ్రామ యువకులు వెంటనే జిల్లా కేంద్రంలోని సాగర్‌ స్నేక్‌ సొసైటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారి నవీన్ ఆదేశాల మేరకు స్నేక్‌ సొసైటీ నిర్వాహకుడు కృష్ణ సాగర్ వచ్చి మొసలిని బంధించి కృష్ణానదిలో విడిచిపెట్టారు. దీంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొసలి సుమారు 9 అడుగుల పొడవు 150 కిలోల బరువు ఉంటుందని అంచనా వేశారు. గ్రామానికి ఓ రైతు పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అడవి పందులకు ఏర్పాటు చేసిన ఉచ్చులో మొసలి చిక్కుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details