తెలంగాణ

telangana

cpi leaders congratulates congress mlas

ETV Bharat / videos

కాంగ్రెస్‌కు అభినందనలు - మంత్రివర్గంలోకి రావాలని ఆహ్వానిస్తే స్వాగతిస్తాం : కూనంనేని సాంబశివరావు - cpi leaders congratulates congress mlas

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 7:57 PM IST

CPI Leaders Met Revanth Reddy : హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలను సీపీఐ నాయకులు కలిశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నేతలు పల్లా వెంకట్ రెడ్డి తదితరులు రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సహా గెలుపొందిన ఎమ్మెల్యేలందరినీ కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ అవసరాల దృష్ట్యా మంత్రివర్గంలోకి రావాలని ఆహ్వానిస్తే స్వాగతిస్తామని సీపీఐ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకోవడం వల్లే విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హస్తం పార్టీ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ప్రకటించిన ఆరు గ్యారంటీలను పేద ప్రజలందరికీ అందేలా చూసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖలో వందల కోట్ల అవకతవకలు జరిగాయని నారాయణ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిసి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తగులబెట్టారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details