Video Viral : లంచం అడుగుతూ దొరికిపోయిన కానిస్టేబుల్ - telangana latest news
Constable asked for bribe in Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో నాలుగు రోజుల క్రితం రాజీపడిన ఫిర్యాదుదారుల సాక్షిగా.. కానిస్టేబుల్కు, ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధికి మధ్య జరిగిన మామూళ్ల సంభాషణ వైరల్గా మారింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారులకు చేరడంతో సదరు కానిస్టేబుల్ను బదిలీ చేశారు. మామూళ్లు తీసుకోమని చెప్పిన ఎస్ఐపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అసలేం జరిగిందంటే.. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఓ కేసు విషయంలో ఫిర్యాదుదారున్ని డీజిల్ ఖర్చుల కింద డబ్బులు ఇవ్వాలంటూ కానిస్టేబుల్ అడిగాడు. 'కొత్తగా ఇదేంటి అంటూ స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధి ప్రశ్నించగా నీకే కొత్తగా అనిపిస్తోంది ఇది ఎప్పటి నుంచో ఉందని' కానిస్టేబుల్ చెప్పుకొచ్చాడు. వాళ్లు బీద వాళ్లని.. ఇంకెప్పుడైనా చూద్దామని ఆ ప్రజాప్రతినిధి కానిస్టేబుల్కు చెప్పారు. అయినా కానిస్టేబుల్ ఎస్సైని ఉద్దేశిస్తూ.. మా సార్ ఇవ్వమంటున్నారు అని కానిస్టేబుల్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.