తెలంగాణ

telangana

Srinidhi Engineering College

ETV Bharat / videos

Clash at Srinidhi University Viral Video : ఏబీవీపీ నేతలు, శ్రీనిధి కళాశాల సెక్యూరిటీ సిబ్బంది డిష్యుం.. డిష్యుం.. వీడియో వైరల్ - Srinidhi Engineering College Riot Latest News

By ETV Bharat Telangana Team

Published : Aug 31, 2023, 6:22 PM IST

Clash at Srinidhi University Viral Video : మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కళాశాల భద్రతా సిబ్బందికి, ఏబీవీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. డిటెన్షన్ చేసిన విద్యార్థుల గురించి మాట్లాడేందుకు ఏబీవీపీ నాయకులు కళాశాల వద్దకు వెళ్లారు. వీరిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని చెదరగొట్టారు. కళాశాల భద్రతా సిబ్బంది, ఏబీవీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Srinidhi University Controversy : శ్రీనిధి విశ్వవిద్యాలయానికి అనుమతి రాక ముందే తప్పుడు సమాచారంతో చేర్చుకుని, తరగతులు నిర్వహిస్తున్నారంటూ.. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. యాజమాన్యం తీరుతో 290 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ విద్యార్థి సంఘాలతో కలిసి వర్సిటీ వద్ద ధర్నాలు చేస్తున్నారు. జులై 31న వర్సిటీ వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు.. అక్కడి ఫర్నీచర్​ను, అద్దాలను ధ్వంసం చేశారు.

ABOUT THE AUTHOR

...view details