తెలంగాణ

telangana

Chandrayaan-3 Rakhi Trend In Uttar Pradesh

ETV Bharat / videos

Chandrayaan 3 Rakhi Trend : చంద్రయాన్-3 రాఖీలకు ఫుల్​ డిమాండ్​.. ధరను సైతం లెక్కచేయకుండా.. - మోదీ యోగి రాఖీలువారణాసి

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 12:14 PM IST

Chandrayaan 3 Rakhi Trend In Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​.. వారణాసిలో చంద్రయాన్-3 రాఖీలకు విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది. చంద్రయాన్-3 వ్యోమనౌక విజయవంతంగా జాబిల్లిపై దిగిన వేళ.. వ్యాపారులు స్పెషల్​ చంద్రయాన్ రాఖీలను డిజైన్​ చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ రాఖీలను కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ధర కాస్త అధికమైనా.. తమ సోదరుల కోసం చంద్రయాన్ రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చంద్రయాన్​-3 రాఖీలు హాట్​ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మోదీ-యోగి రాఖీలతో (Modi Yogi Rakhis) పాటు ఇప్పుడు చంద్రయాన్ రాఖీల ట్రెండ్​ మొదలైంది.  

గతంలో బాలీవుడ్​ చిత్రాల నటీనటుల ఫొటోలతో రాఖీలు తయారుచేసేవాళ్లమని ఓ వ్యాపారి తెలిపాడు. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​కు ప్రజల్లో ఆదరణ లభిస్తున్నందున.. వారి ఫొటోలతో రాఖీలు అమ్ముతున్నామని చెప్పాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించి మాట్లాడుకుంటున్నారని.. అందుకే ఆ రాఖీలు తయారు చేశామని తెలిపాడు. చంద్రయాన్​ రాఖీలపై ప్రజలు ఆసక్తి చూపిస్తుడటం వల్ల వ్యాపారం కూడా బాగా జరుగుతోందన్నాడు. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్​ జాబిల్లిపై విజయవంతంగా ల్యాండ్​ అయిన సందర్భంగా.. సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్​ అయింది. అందులో భూమి.. చందమామకు రాఖీ కడుతున్నట్టు ఉంది. ఆ ఫొటోను వైరల్ చేస్తూ.. రాఖీ ముందుగానే వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

ABOUT THE AUTHOR

...view details