Chandrayaan 3 Pragyan Rover Landing : చంద్రుడిపై భారత సంతకం! 'ప్రగ్యాన్' ల్యాండింగ్ వీడియో చూశారా?
Published : Aug 25, 2023, 12:17 PM IST
|Updated : Aug 25, 2023, 12:36 PM IST
Chandrayaan 3 Pragyan Rover Landing Video:విక్రమ్ ల్యాండర్ లోపలి నుంచి బయటకు వచ్చి ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో తాజాగా విడుదల చేసింది. ల్యాండర్ ఇమేజ్ కెమెరాలో బంధించిన రోవర్ వీడియో ఆకట్టుకుంటోంది. చందమామ దక్షిణ ధ్రువం వద్ద విక్రమ్ ల్యాండ్ అయిన కొన్ని గంటల తర్వాత రోవర్ సాఫీగా బయటకు వచ్చింది. అనతంరం తన వెనుక ఉన్న రెండు చక్రాలతో ఇస్రో లోగో, జాతీయ చిహ్నాన్ని చంద్రుడి ఉపరితలంపై ముద్ర వేసింది.
Pragyan Rover Status : 26 కిలోల బరువు ఉన్న ప్రగ్యాన్ రోవర్.. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇందులో ఉన్న పేలోడ్లు.. రాంభా (RAMBHA), చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పరిమెంట్ (ChaSTE), ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్‌లను ఆన్ చేసినట్లు గురువారం ఇస్రో తెలిపింది.