తెలంగాణ

telangana

Chandrayaan 3 Landing Time

ETV Bharat / videos

Chandrayaan 3 : చంద్రయాన్​-3 కోసం విశేష పూజలు.. త్రివర్ణాలతో గంగా హారతి.. అమెరికాలో హోమాలు

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 8:04 AM IST

Updated : Aug 23, 2023, 8:20 AM IST

Chandrayaan 3 Landing Time : కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చారిత్రక క్షణాలు రానే వచ్చాయి. మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే చంద్రయాన్​-3 విజయవంతమవ్వాలని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా భగవంతుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.

జాతీయ జెండాలతో గంగా హారతి..
ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో చంద్రయాన్​-3 ల్యాండింగ్​ విజయవంతంగా జరగాలని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమార్థ్ నికేతన్ ఘాట్‌లో జాతీయ పతాకాలను చేతపట్టుకుని గంగా హారతి జరిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు.

ఆల్​ ది బెస్ట్​ చంద్రయాన్​..
ఒడిశాలోని పూరిలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్​.. చంద్రయాన్​-3కి తన కళతో ఆల్​ ది బెస్ట్ తెలిపారు. పూరి సముద్ర తీరాన సుదర్శన్​ బృందం.. భారీ సైకత శిల్పాన్ని రూపొందించింది. జయహో ఇస్రో అంటూ ఇసుకతో చెక్కింది. ఈ సైకత శిల్పం.. పర్యాటకలను విశేషంగా ఆకర్షిస్తోంది.

దర్గాలో ప్రార్థనలు..
ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో చంద్రయాన్​-3 విజయవంతం కావాలని బీజేపీ నాయకుడు మొహ్సిన్​ రజా.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హజ్రత్ షా మీనా షా దర్గాలో ప్రార్థించారు. "దేశ ప్రజలందరూ చంద్రయాన్-3 ల్యాండింగ్​ కోసం ఎదురుచూస్తున్నారు. యావత్​ దేశానికి ఇది గర్వించదగిన క్షణం" అని మొహ్సిన్ రజా తెలిపారు.

అమెరికాలో ప్రత్యేక హోమం..
దేశంలోనే కాకుండా అగ్రరాజ్యం అమెరికాలోనూ భారత సంతతి ప్రజలు.. చంద్రయాన్​-3 కోసం విశేషంగా పూజలు చేస్తున్నారు. వర్జీనియాలో ఓ భారత సంతతి దంపతులు.. ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో పంచామృతాలతో మూలవిరాట్​కు అభిషేకం నిర్వహించారు.

Last Updated : Aug 23, 2023, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details