MLC Mahendar Reddy: ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను: మహేందర్ రెడ్డి - ranga reddy MLC
MLC Mahendar Reddy Clarity On BRS: తాను బీఆర్ఎస్ను వీడి భాజపాలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీకి మాకు ఎలాంటి సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేది లేదని ఆయన తెలిపారు పార్టీ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు ఇంఛార్జిగా పనిచేయాల్సి వస్తుందని, అందువల్ల కొద్దిరోజులు తన నియోజకవర్గానికి, కార్యకర్తలకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని ఛానల్స్‌లో వేస్తున్నారు, ఎవరు రాయిస్తున్నారో కూడా తెలుసని అన్నారు. పార్టీ మార్పుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ పట్నం వెల్లడించారు. మే 25 నుంచి తాండూరు నియోజకవర్గంలో పల్లె పల్లెకు పట్నం కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. మహేందర్ రెడ్డి సీనియర్ నాయకుడిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.