బీఆర్ఎస్ ఎంపీపీ కాంగ్రెస్లో చేరినందుకు రాజీనామా చేయాలని స్థానిక నేతల ఆందోళన - బీఆర్ఎస్ సర్పంచ్ నాయకులు ఎంపీపీ తో గొడవ
Published : Nov 21, 2023, 4:51 PM IST
BRS Leaders Fight With MPP for Resignation :యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఎంపీపీ నిర్మలకు సర్పంచులకు, ఎంపీటీసీలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిన్న హైదరాబాదులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సమక్షంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ భువనగిరి మండల సర్వసభ సమావేశానికి హాజరైన ఎంపీపీని స్థానిక బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు అడ్డుకున్నారు. పార్టీ మారినప్పుడు పదవికి కూడా రాజీనామా చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో కొద్దిసేపటి వరకు ఎంపీపీకి, స్థానిక నాయకుల మధ్య గొడవ జరిగింది. వెంటనే అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. పదవికి రాజీనామా చెయ్యాలని, పార్టీ ఎందుకు మారారో సమాధానం చెప్పాలని ఎంపీపీ నిర్మలను నిలదీశారు. వెంటనే పోలీసులు గొడవను అదుపు చేసి, వారిని వారించారు. అనంతరం మరోసారి బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు.. ఎంపీపీని అడ్డుకొని తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీడివో కార్యాలయం వద్ద ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు.