హిమాలయాల నుంచి జనావాసాల్లోకి గోధుమ రంగు ఎలుగుబంట్లు
జమ్ముకశ్మీర్‌లో అరుదైన గోధుమ రంగు ఎలుగుబంట్లు కనువిందు చేశాయి. శ్రీనగర్‌లోని లేహ్ హైవే సమీపంలోని మినీమార్గ్ ప్రాంతంలో ఇవి కనిపించాయి. ఆహారం కోసం స్థానిక అడవి నుంచి ఎలుగులు జనారణ్యంలోకి ప్రవేశించాయి. ఇందులో తల్లి ఎలుగు బంటితో పాటు మరో పిల్ల ఎలుగుబంటి ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించారు. స్థానికులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా వచ్చిన దారినే అవి వెనుదిరిగాయి. హిమాలయాల్లో అత్యంత అరుదుగా కనిపించే ఈ భారీ ఎలుగులు 250 కిలోల వరకు బరువుంటాయని స్థానికులు తెలిపారు. రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఇవి జీవిస్తుంటాయని పేర్కొన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST