హాస్పిటల్లో బాంబు పెట్టామంటూ ఈ-మెయిల్ - బాంబు పెట్టామంటూ ఈమెయిల్
Published : Dec 28, 2023, 11:58 AM IST
Bomb Threat Email to Vijayawada Govt New Hospital: విజయవాడ ప్రభుత్వ కొత్త హాస్పిటల్లో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్‌తో అటు పోలీసులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. బుధవారం మధ్యాహ్నం విజయవాడ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఈ-మెయిల్‌కు వచ్చిన సమాచారంతో అంతా ఆందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు. 'నేను మీ ఆసుపత్రుల్లో చాలా బాంబులు పెట్టాను. పేలుడు పదార్థాలు కనిపించకుండా దాచాను. అవి కొద్ది గంటల్లో పేలనున్నాయి. మీరందరూ చనిపోతారు. మేం 'ప్యూనింగ్' అనే తీవ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులం' అని అందులో ఉంది.
దీనిపై వెంటనే అప్రమత్తమైన ప్రన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మూడు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అది కేవలం బెదిరింపు మెయిల్‌గా తేల్చారు. నకిలీ సమాచారమని గుర్తించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 70 ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు బుధవారం వేకువజామున 4.02 నిమిషాలకు బెదిరింపు మెయిల్ పంపినట్లుగా గుర్తించారు.