లైవ్ వీడియో.. నదిలో రేస్ కోసం వెళ్తూ పడవ బోల్తా.. ఇద్దరు మృతి - కేరళ అలప్పుజ న్యూస్
కేరళ అలప్పుజలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. అచ్చన్‌కోవిల్ నదిలో పడవ బోల్తా కొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా పంపా నదిలో జరిగే బోటు రేసులో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. నీట మునిగి మరణించిన ఆదిత్యన్ (17), వినీష్ (39) మృతదేహాలను వెలికితీశారు. శనివారం జరిగిందీ ప్రమాదం.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST