Viral Video : చికెన్ కూరలో బ్లేడ్.. అవాక్కైన కస్టమర్.. వీడియో వైరల్ - Mix blade in chicken curry
Blade In Chicken Curry At Medchal : బాగా ఆకలి వేసినప్పుడు ఏదైనా తినాలనిపించి హోటల్‌కు వెళ్లాము. అంతగా ఆకలి వేసినప్పుడు కాయగూరలతో ఏం తింటామని.. కోడి కూరతో భోజనం ఆర్డర్ చేశాము. ఆర్డర్ ఇచ్చి పది నిమిషాలైన ఇంకా భోజనం రాలేదు.. ఎంత వేగంగా వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము. అంతలోనే మనం చేసిన ఆర్డర్ రావడం చూసి ఎడారిలో నీరు దొరికిన వాడిలా ప్రాణాలు లోచి వచ్చాయి. ఆకలి దంచి కొట్టడంతో మొదటి ముద్ద నోటిలో పెట్టేసరిగా ఆ హాయి చెప్పలేనిది. ఇక రెండో ముద్ద నోటిలో పెట్టేసరికి తెలుపుగా ఒకటి తన కంటికి తగిలింది. అది ఏంటా అని చూసేసరికి ఇంకేంటి బ్లేడ్ ముక్క. ఒక్కసారిగా షాక్‌కు గురై.. అంత ఆకలి కాస్త చచ్చిపోయింది.
ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి ఈసీఐఎల్ చౌరస్తాలో జరిగింది. నాగభూషణం మెస్‌లో మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లిన సాయినాథ్ అనే వ్యక్తి చికెన్ భోజనం ఆర్డర్ చేశాడు. అయితే ఇంతలోనే తినాలని అనుకున్నాడు. తీరా తింటుండగా అందులో మిక్సీ బ్లేడ్ రావడంతో అవాక్కైయ్యాడు. వెంటనే హోటల్ యజమానిని అడగడంతో దురుసుగా సమాధానం చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు అందుకు పోలీసులు విచారణ చేపట్టారు.