తెలంగాణ

telangana

BJP MP Laxman Press Meet

ETV Bharat / videos

లోక్​సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖాయం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్​ - బీజేపీ ఎంపీ ప్రెస్​ మీట్​

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 4:50 PM IST

BJP MP Laxman Press Meet : రాబోయే లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ రెండు అంకెల స్థానాల్లో గెలవడం ఖాయమని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్​ అన్నారు. లోక్​సభ ఎన్నికలు ఎదుర్కోవడానికి బీజేపీ పార్టీ ఇప్పటికే సిద్ధమైందన్న ఆయన, పది సీట్లు గెలుపే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. నల్గొండలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ కె. లక్ష్మణ్​ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, వారి కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.  

BJP Leader About BRS :బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించారని కె.లక్ష్మణ్​ ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ లాభపడ్డా బీజేపీనే గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే స్థానంతో మొదలై, ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలు, ప్రధాని మోదీ డబుల్​ ఇంజిన్​ సర్కారు రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉచితాల పేరుతో ప్రజలను ఎక్కువ రోజులు మోసం చెయ్యలేరని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details