ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్‌కు ప్రేమ పుట్టుకొస్తుంది: లక్ష్మణ్ - BJP latest news
MP Laxman fire on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢవిశ్వాసాల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శ్రీరామనవమికి రాముడికి తలంబ్రాలు ఇవ్వని ముఖ్యమంత్రి.. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది కేసీఆరే అని ఆయన విమర్శించారు. పెట్రోల్ డీజిల్‌పై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇరవై రూపాయలకు పైగా పన్ను తగ్గిస్తే.. రాష్ట్రంలో కనీసం ఐదు రూపాయలు తగ్గించడానికి ఈ సర్కారుకు మనసు రావట్లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రేమ పుట్టుకొస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఈనెల 8వ తేదీన రాష్ట్రానికి రానున్నట్లు ఆయన తెలిపారు. 20వేల కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాలు వారి వారి సమస్యల పరిష్కారం కోసం మోదీ, భారత్ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
"ఎన్నికలు వస్తేనే దళితులపై కేసీఆర్‌కు ప్రేమ పుట్టుకొస్తుంది. ఎన్నికలు వస్తున్నాయనే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. పేదలకు ఇల్లు కట్టుకోడానికి రూ.5 లక్షలు ఇస్తామని ఇప్పుడు రూ.3 లక్షలకు తగ్గించారు. ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యాలయాలు మాత్రం పూర్తవుతున్నాయి. 8 ఏళ్లు అయినా పేదల ఇళ్లు పూర్తి కావడం లేదు."- లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు