తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫ్లైఓవర్​పై బర్త్​డే సెలబ్రేషన్స్​.. తుపాకులు పేల్చుతూ హల్​చల్​ - బిహార్​

By

Published : May 8, 2022, 9:56 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

birthday celebration firing: బిహార్ రాజధాని పట్నా నడిబొడ్డున కొందరు యువకులు హల్​చల్​ చేశారు. ఫ్లైఓవర్​పై జన్మదిన వేడుకలు చేసుకుంటూ ట్రాఫిక్​ జామ్​కు కారణమవటమే కాకుండా తుపాకీ పేల్చుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రాహుల్​ యాదవ్​ అనే యువకుడి ఇన్​స్టాగ్రామ్​లో రెండు వారాల క్రితం ఈ వేడుకలు లైవ్​ స్ట్రీమింగ్​ చేశారు. చాలా మంది యువకులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డుపై వారి వాహనాలను వరుసగా పెట్టటం వల్ల ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. కేక్​ కట్టింగ్​ తర్వాత కొందరు యువకులు తుపాకులు పేల్చుతూ కనిపించారు. రాజధానిలో యువకులు తుపాకులతో హల్​చల్​ సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details