తెలంగాణ

telangana

కేరళలో మంటల్లో కాలిపోయిన బైక్‌

ETV Bharat / videos

సడెన్​గా బైక్​లో నుంచి పొగలు.. చూస్తుండగానే అగ్నికి ఆహుతి.. - కేరళలో ప్రమాదవశాత్తు బైక్ దగ్ధమైంది

By

Published : Apr 20, 2023, 7:05 AM IST

Updated : Apr 20, 2023, 1:34 PM IST

ప్రయాణంలో ఉండగా మంటలు చెలరేగి ఓ బైక్​ పూర్తిగా దగ్ధమైంది. బైక్​ రన్నింగ్​లో ఉండగానే ఇంజిన్​లో నుంచి పొగలు వచ్చాయి. అనంతరం బైక్​ మొత్తం మంటలు అంటుకున్నాయి. బైక్​పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేసింది.

కేరళ తిరువనంతపురంలోని కన్యాకుమారి నాగర్‌కోయిల్ ప్రాంతంలో ఘటన జరిగింది. ఏప్రిల్​ 18న.. సాయంత్రం 4 గంటల సయమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు బైక్​పై వెళ్తున్న సమయంలో ఇంజిన్​ నుంచి పొగ రావడం ప్రారంభమైంది. దీన్ని గమనించిన బైకర్..​ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. పొగ మరింత పెరిగి మంటలు రావడం వల్ల.. వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేశాడు. దానికి స్థానిక వ్యక్తులు, ట్రాఫిక్​ పోలీసులు కూడా సాయం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. బైక్​ నుంచి మంటలు రావడం ఎక్కువై వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అనంతరం వారొచ్చి మంటలను ఆర్పేశారు.

బుల్లెట్ బైక్​కు మంటలు... చూస్తుండగానే పూర్తిగా..
కొద్ది రోజుల క్రితం తమిళనాడులోని చెన్నైలో ఓ రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్ మంటల్లో కాలిపోయింది. వల్లువార్ కొట్టం రోడ్​పై వెళ్తున్న వాహన డ్రైవర్​.. బైక్ వేడెక్కడాన్ని గమనించాడు. వెంటనే రోడ్డు పక్కన బైక్​ను ఆపేశాడు. ఈ క్రమంలోనే బైక్​లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్లో నుంచి నీటిని తీసుకొచ్చి బైక్​పై పోశారు. మంటలను అదుపులోకి తెచ్చారు. నుంగంబక్కం అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పేశారు. వాహనదారుడు ఈ బుల్లెట్ బండిని రెండేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన స్టోర్ నుంచి ఇంటికి వెళ్తుండగా మంటలు చెలరేగాయని వాహనదారుడు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 20, 2023, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details