Lady suicide attempt in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ ఆత్మహత్యాయత్నం
Lady suicide attempt in Shamshabad Airport : రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ప్రేమ విఫలమైందని ఒకరు.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు. వివాహేతర సంబంధం బయట పడిందని ఒకరు.. ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని ఇంకొకరు ఇలా అనునిత్యం ఏదో ఒక కారణంతో ఆత్మహత్యల వార్తలు వింటున్నాం. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విమానాశ్రయంలోని రెండో అంతస్తు పై నుండి దూకడానికి ప్రయత్నించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ అధికారులు గమనించి ఆ యువతిని చేతులు పట్టుకొని పైకి లాగి యువతిని కాపాడారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
అనంతరం ఆ యువతిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఐడీ, ఆధార్ కార్డు ఆధారంగా బాధితురాలు బెంగళూరుకు చెందిన శ్వేతగా గుర్తించారు. ప్రియుడితో వివాదం కారణంగా మనస్థాపంతో తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు ఆ యువతి తెలిపింది. ఆమె ప్రియుడు విష్ణువర్ధన్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. శ్వేత విజ్ఞప్తి మేరకు.. ఇరువురిని పంపించేశారు. ఆ యువతిని కాపాడినందుకు అక్కడి ప్రయాణికులు సీఐఎస్ఎఫ్ అధికారులను అభినందించారు.