రోడ్డుపై బీర్ల వరద.. లారీ బోల్తా పడి చెల్లాచెదురైన 25,000 సీసాలు - లారీ బోల్తాపడి చెల్లాచెదురైన బీర్లు
Beer Truck Accident Today : తమిళనాడులో బీర్లు తరలిస్తున్న ఓ లారీ.. ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటనలో 25,200 బీర్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దాంట్లో సగానిపైగా పగిలి.. రహదారిపై 'బీర్ల వరద' పారింది. తిరుపుర్ జిల్లాలోని సేలం-కోయంబత్తూరు జాతీయ రహదారిపై.. పాలగొండపాళ్యం సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆశ్చర్యకరంగా బీరు సీసాలకు కాపలా కాస్తూ.. ఎవరూ తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు వచ్చేంత వరకు వాటికి రక్షణగా నిలిచారు. అనంతరం ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. సెల్వకుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి లారీని నడిపినట్లు తెలిపారు. చెంగల్పట్టు బీర్ కంపెనీ నుంచి ఈ లోడ్ వస్తున్నట్లు పేర్కొన్నారు.
బీరు లోడ్ లారీ బోల్తా.. ఎగబడ్డ మందుబాబులు..
Beer Truck Overturn In AP : కొద్ది రోజుల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ.. బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు.. భారీగా అక్కడికి చేరుకున్నారు. వీడియో కోసం ఇక్కడి క్లిక్ చేయండి.