తెలంగాణ

telangana

Nizamabad train accident

ETV Bharat / videos

తల్లి తొందరపాటు..కన్న కొడుకుకి శాశ్వత అంగవైకల్యం - తెలంగాణ రైలు ప్రమాదాలు

By

Published : Apr 12, 2023, 4:58 PM IST

Nizamabad train accident: తల్లి తొందరపాటు కన్న కొడుకు పాలిట శాపంగా మారింది. ఏకంగా ఆ కుమారుడికి జీవితాంతం ఒక కాలు లేకుండాపోయింది. కదులుతున్న ట్రైన్​లో నుంచి తన కుమారుడిని దింపే ప్రయత్నం చేసింది ఆ తల్లి. ఈ ప్రయత్నమే ఆ బాలుడికి కాలు లేకుండా అయ్యింది.  నిజమాబాద్ జిల్లా డిచ్​పల్లి రైల్వే స్టేషన్​లో ఈ విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ట్రైన్​లో తల్లి, కొడుకు ప్రమాణిస్తున్నారు. ఆ ట్రైన్ డిచ్​పల్లి స్టేషన్​లో ఆగుతున్న సమయంలో కొడుకుని అందులో ఉంచి తల్లి ముందుగా దిగింది. రైలు కదులుతుండటంతో.. తొందరగా బాలుడిని దింపే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో ప్రమాదశావత్తు బాలుడు పట్టాలపై పడ్డాడు. దీంతో అతని కాలు పై నుంచి ట్రైన్ వెళ్లడంతో పాదం పూర్తిగా తెగిపోయింది. తలకు కూడా బలమైన గాయలయ్యాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఒక్కసారిగా అరిచేసరికి ట్రైన్ ఆపివేశారు. క్షతగాత్రుడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.  

ABOUT THE AUTHOR

...view details