Barasala for calves in Medak : లేగ దూడలకు బారసాల.. ఎక్కడంటే..? - లేగదూడల బారసాల
Barasala for calves in Medak : ఈ మధ్య బర్త్ డే, పెళ్లిళ్లు మనుషులకు మాత్రమే నిర్వహించే వారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూస్తున్నారు నేటి తరం. అందులో భాగంగానే వాటికి బర్త్ డే పార్టీలు కూడా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు, గాడిదలు.. ఇలా రకరకాల జంతువులకు అంగరంగ వైభవంగా పెళ్లిల్లు చేస్తున్నారు. ఇలాంటి ఓ వింత సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ సారి బర్త్ డే కాదు.. పెళ్లి అంతకన్నా కాదు. మరి ఏ వేడుక నిర్వహించారంటే..?
సాధారణంగా ఎవరైనా పిల్లలు పుడితే వారికి బారసాల చేసి పేర్లు పెట్టడం అందరికి తెలిసిందే. కానీ తాము ప్రేమగా పెంచుకునే ఆవులు దూడలకు జన్మనివ్వగా వాటికి బారసాల నిర్వహించినడం విశేషం. మెదక్‌కి చెందిన కొత్త చంద్రకళ, ప్రభాకర్ దంపతులు కొంత కాలంగా రెండు ఆవులను పెంచుకుంటున్నారు. వాటికి ఇటీవల రెండు లేగ దూడలు పుట్టాయి. వాటికి తొట్టెలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా అలంకరించిన ఉయ్యాలలో బారసాల కార్యక్రమం నిర్వహించారు. లేగ దూడలకు సాయిరాం, నందిని అని పేర్లు పెట్టారు. షిరిడి ప్రభాకర్ దంపతులు మాట్లాడుతూ గోవులను రక్షించడం మనందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటివద్ద గోవులను సంరక్షించాలని కోరారు.