గణేశ్ నిమజ్జనంలో ట్రాక్టర్ నడిపిన బండి సంజయ్ - బండి సంజయ్
కరీంనగర్‌లో వినాయక నిమజ్జనంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. చైతన్యపురిలోని శ్రీ మహా శక్తి ఆలయంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. నిమజ్జనానికి తీసుకెళ్లే ట్రాక్టర్‌కి ప్రత్యేక పూజలు చేసిన బండి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ నిమజ్జనంలో పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య వినాయకున్ని మానకొండూరు చెరువులో నిమజ్జనం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST