Asaduddin Owaisi on National Unity Day : 'హైదరాబాద్‌కు వచ్చి.. అమిత్ షా అబద్ధాలు చెప్పారు' - తెలంగాణ న్యూస్
Published : Sep 17, 2023, 7:09 PM IST
Asaduddin Owaisi on National Unity Day : హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చి అబద్దాలు చెప్పారని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో సమైక్యం చేసే సమయంలో ఆర్‌ఎస్ఎస్, సంఘ్ పరివార్, బీజేపీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. బీజేపీదే పాత్ర ఉందని వేడుకలు చేసుకుంటున్నాయని నిలదీశారు. ఎంఐఎం అధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తిరంగ బైక్ ర్యాలీ(Tiranga Bike Rally) నిర్వహించారు. నాంపల్లిలోని యూసుఫియన్ దర్గా నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ర్యాలీ కొనసాగింది.
MP Asaduddin Owaisi Fires on BJP : హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. నిజాం కాలంలో కట్టినవే ఇంకా హైదరాబాద్ నగరంలో ప్రముఖంగా ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌ను కలపడానికి పోలీస్ చర్య జరిగిందని.. పండిట్ సుందర్‌లాల్ ఇచ్చిన నివేదికలో ముస్లింలపై జరిగిన ఘటనలను వివరించారని తెలిపారు. రజాకార్ల ఏరివేత పేరుతో ముస్లింలపై జరిగిన దారుణాలు.. ఘటనలోని ఆ నివేదికలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింలకు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.