ఏంటీ! పాడి పశువుల అందాల పోటీలా!! - మీరెప్పుడైనా చూశారా? - Animal Beauty Pageants In Warangal
Published : Jan 14, 2024, 9:35 PM IST
Animal Beauty Pageants In Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా రైతు సేవా సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీలు నిర్వహించారు. బాలుర సెకండరీ పాఠశాల ఆవరణలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం సాదు జంతువుల పోటీలు జరిపారు. ఈ పోటీల్లో జోడెడ్లు, ఆవు దూడలు, గొర్రె పొట్టేళ్లు, మేకలతో పాటు వివిధ రకాల సాదు జంతువులైన కుక్కలు, కోళ్లు, పిల్లులు తదితర జంతువులను అందంగా తయారు చేసి అందాల పోటీలో నిలిపారు రైతులు. పోటీల్లో గెలుపొందిన పాడి పశువుల యజమానులకు బహుమతి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
Beauty Contest for Animals in Narsampet : సంక్రాంతి రోజున ప్రతి సంవత్సరం పశువుల అందాల పోటీ నిర్వహిస్తుంటామని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అందాల పోటీలు నిర్వహించగా రైతులు వారి పాడి పశువులను అందంగా తయారు చేసుకుని తీసుకొచ్చారని నరసింహ రెడ్డి తెలియజేశారు. ఈ విధంగా పశువులను గౌరవించడం మన సాంప్రదాయమని, పోటీలే కాకుండా వాటి ఆరోగ్యం పట్ల కూడా ఆలోచించి ఇక్కడే హెల్త్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. మూడు నెలలకు సరిపడా ఉచిత మందులను రైతులకు అందజేయడం జరిగిందని వివరించారు.