తెలంగాణ

telangana

Akhilesh Yadav Climbed Locked Gate In Lucknow

ETV Bharat / videos

Akhilesh Yadav Climbed Locked Gate In Lucknow : అఖిలేశ్​ యాదవ్​కు చేదు అనుభవం.. అక్కడికి నో ఎంట్రీ.. గేటు దూకి మరీ లోక్​నాయక్​కు నివాళి​ - jpnic వద్ద అఖిలేశ్​ యాదవ్​కు చేదు అనుభవం

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 4:30 PM IST

Akhilesh Yadav Climbed Locked Gate In Lucknow : ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని లోక్​నాయక్​ జయప్రకాశ్​ నారాయణ్​ అంతర్జాతీయ కేంద్రం వద్ద సమాజ్​వాది పార్టీ చీఫ్​ అఖిలేశ్​ యాదవ్​కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన జయంతి సందర్భంగా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు అఖిలేశ్​ పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. 

జేపీ ఇంటర్నేషనల్​ సెంటర్​లో చెట్లు నాటే పనులు జరుగుతుండడం వల్లే తమకు ముందుగా ఇచ్చిన అనుమతిని లఖ్​నవూ డెవలెప్​మెంట్​ అథారిటీ మళ్లీ వెనక్కి తీసుకుందని ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్​ ఉత్తమ్​ పాటేల్​ ఈటీవీ భారత్​తో చెప్పారు. జయప్రకాశ్​ నారాయణ్​ జయంతి సందర్భంగా ఆయనకు పూలదండలు వేసి నివాళులర్పించేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదని.. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. కాగా.. ఇలాంటి కుట్రలకు రాష్ట్రంలోని అధికార బీజేపీ సమాధానం చెప్పాలని దుయ్యబట్టారు. తాము లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు JPNIC చుట్టూ సన్నటి ఇనుప రేకులను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఇక చేసేదేమి లేక అఖిలేశ్ యాదవ్​ గేటు దూకి మరి లోపలికి వెళ్లి జయప్రకాశ్​ నారాయణ్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details