తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం - తెలంగాణ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్
Published : Dec 9, 2023, 10:44 AM IST
|Updated : Dec 9, 2023, 10:54 AM IST
Akbaruddin Owaisi Sworn in Protem Speaker in Telangana : తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్‌తో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం, హరీశ్‌రావు సహా ఇతర నేతలు పాల్గొన్నారు. చాంద్రాయణగుట్ట నుంచి 1999 మొదలు ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు అక్బరుద్దీన్ ఒవైసీని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు.
మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారంతోపాటు సభా కార్యకలాపాల కోసం ప్రొటెం స్పీకర్‌ను నియమించారు.కాగా శాసనసభాపతి ఎన్నిక కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈరోజు తెలంగాణ మూడవ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉన్నందున ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత సభ ముగియనుంది. 3, 4 రోజుల అనంతరం తిరిగి సమావేశాలు జరగనున్నాయి.