Aerial View of Ganesh Idol Immersion : ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనం ఏరియల్ వ్యూ - మంత్రులు ఏరియల్ వ్యూ
Published : Sep 28, 2023, 4:56 PM IST
Aerial View of Ganesh Idol Immersion in Hyderabad : హైదరాబాద్ నగరంలో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఏరియల్ వ్యూ ద్వారా మంత్రులు పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ.. డీజీపీ అంజనీ కుమార్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను గగనం నుంచి వీక్షించారు.
ట్యాంక్‌బండ్ దగ్గర హుస్సేన్‌సాగర్‌కు లంబోదరుడు తరలి వచ్చే మార్గాలలో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రానికి ఆ ప్రాంతం మొత్తం గణేశ్ నిమజ్జనానికి వచ్చే భక్తులతో కోలాహలంగా మారనుంది. దీంతో మంత్రులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి.. వంటి విషయాలను ఏరియల్ వ్యూ ద్వారా తెలుసుకున్నారు. అంతకు ముందు ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర ఎంతో ఘనంగా జరిగింది. ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు గణపతిబప్ప మోరియా నామస్మరణ మార్మోగిపోయింది. అత్యధిక మొత్తంలో జనసమూహం ఈ యాత్రలో విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ఖైరతాబాద్ మహాగణపతిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.