తెలంగాణ

telangana

Road Accident at Adilabad

ETV Bharat / videos

Adilabad Lorry Accident Viral Video : కంటైనర్​ బీభత్సం.. లారీ.. బైక్​.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా.. - లారీ కంటైనర్​ రోడ్డు ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 8:44 PM IST

Adilabad Lorry Accident Viral Video : ఆదిలాబాద్​ జిల్లాలో ఓ కంటైనర్​ అదుపు తప్పి లారీ, ద్విచక్ర వాహనం, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడంతో ప్రస్తుతం వైరల్​గా​ మారాయి. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్​ జిల్లా గుడిహత్నూర్​ మండలం మన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ కంటైనర్​ బీభత్సం సృష్టించింది. నిర్మల్​ నుంచి ఆదిలాబాద్​ వస్తున్న ఓ కంటైనర్​ లారీ.. మన్నూర్​ జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణించింది. దీంతో అదుపు తప్పి.. రోడ్డుకు అవతలి వైపునకు దూసుకెళ్లి ముందుగా లారీని ఢీ కొట్టింది. అనంతరం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అంతటితో ఆగకుండా కాస్త ముందుకు వెళ్లి ఆ మార్గంలో వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్​తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details