తెలంగాణ

telangana

Niharika

ETV Bharat / videos

Niharika on Life Style Expo : వస్త్రాభరణాల ప్రదర్శనలో మెరిసిన నిహారిక - Madapur HighLife Exhibition latest news

By

Published : Jul 23, 2023, 7:40 PM IST

Actress Niharika Launch Life Style Expo in Hyderabad : హైదరాబాద్‌ మాదాపూర్‌లోని సినీ కథానాయికలు నిహారిక, శాన్వీ మేఘన సందడి చేశారు. రాబోయే ఉత్సవాలను దృష్ట్యాలో పెట్టుకొని.. హెచ్‌ఐఐసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌, లగర్జీ, లైఫ్‌స్టైల్‌ వస్త్రాభరణాల ప్రదర్శను నిహారిక, శాన్వీ మేఘన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఆభరణాలను ధరించి వారు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల యువ డిజైనర్లకు, యువ పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు వస్తున్నాయని నిహారిక పేర్కొన్నారు. మరోవైపు అన్ని రకాలైన ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు నిహారిక వివరించారు. 

ఇక్కడ అన్ని రకాల వస్త్రాభరణాలను అందుబాటులో ఉంచారని శాన్వీ మేఘన అన్నారు. తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. దాదాపు 250 మంది డిజైనర్లు రూపొందించిన విభిన్న రకాలైన.. వస్త్రాభరణాలను అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు. మూడ్రోజుల పాటు ఈ ప్రదర్శన నగరవాసులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details